జార్ఖండ్‌లో భూకంపం.. వణికిన రాంచీ, జంషెడ్‌పూర్ | Earthquake Hits Jharkhand With Estimated Magnitude 4.3 | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో భూకంపం.. వణికిన రాంచీ, జంషెడ్‌పూర్

Nov 2 2024 11:04 AM | Updated on Nov 2 2024 11:14 AM

Earthquake Hits Jharkhand With Estimated Magnitude 4.3

రాంచీ: జార్ఖండ్‌లో భూకంపం సంభవించింది.  రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల పలు జిల్లాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.

జార్ఖండ్‌లోని ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 9:20 గంటలకు భూకంపం వచ్చింది. వెంటనే జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

ఇది కూడా చదవండి: దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్‌ శుభ్రం చేయించి..

 

Advertisement
 
Advertisement
Advertisement