‘రెండు రూపాయల డాక్టర్’ ఇకలేరు | Dr AK Rairu Gopal passed away | Sakshi
Sakshi News home page

‘రెండు రూపాయల డాక్టర్’ ఇకలేరు

Aug 3 2025 5:58 PM | Updated on Aug 3 2025 6:38 PM

Dr AK Rairu Gopal passed away

తిరువనంతపురం: పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నిస్వార్ధ సేవకుడు. డాక్టర్ ఏకే రైరూ గోపాల్ అలియాస్ రెండు రూపాయల డాక్టర్ఆదివారం (ఆగస్టు 3న) కన్నుమూశారు. ఉత్తర కేరళలోని కన్నూర్‌లో వేలాది మంది జీవితాల్లో నిస్వార్థ సేవ చేసిన డాక్టర్గోపాల్పేదలు,అణగారిన ప్రజలకు దశాబ్దాలుగా(ఒక దశాబ్ధం అంటే 10ఏళ్లు) రెండు రూపాయిలకే వైద్యం అందించారు.

డాక్టర్ఏకే రైరూ గోపాల్‌ 50 ఏళ్ల పాటు అతి తక్కువకే రూ.2కే వైద్యం చేసేవారు. అందుకే ఆయనను అందరూరెండు రూపాయల డాక్టర్‌..రెండు రూపాయల డాక్టర్’ అని పిలుస్తుంటారు. ఇతర డాక్టర్లు ఒక్క ఓపీకి వందల్లో ఛార్జ్చేస్తుంటే డాక్టర్గోపాల్మాత్రం పేషెంట్స్థోమతను బట్టి రూ.40, రూ.50 మాత్రమే తీసుకునేవారు.

అలా వైద్యం ఖరీదైన తరుణంలో డాక్టర్గోపాల్మాత్రం వైద్యంలో దాతృత్వం, నీతికి చిహ్నంగా నిలిచారు. వైద్యుడిగా సేవలందిస్తుండగా.. రోగి దారుణమైన పరిస్థితిని చూసి చలించిపోయారు. అలా ఆయన ప్రయాణం స్వచ్ఛంద సేవతో ప్రారంభమైంది. నాటి నుంచి ముఖ్యంగా రోజూవారి దినసరి కూలీలు, విద్యార్థులకు, పేదలకు అందుబాటులో సరసమైన వైద్యాన్ని అందించేందుకు తనని తాను అంకితం చేసుకున్నారు.

విధులు నిర్వహించే సమయంలో తన మిత్రులు, కుటుంబ సభ్యులు,ఇంకెవరైనా తనని కలిసేందుకు వస్తే రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. తన ఇంటి గేటుకు బోర్డు తగిలలించారు. బోర్డులో రోగులకు చికిత్స చేసే సమయంలో తనకోసం ఎవరూ రావొచద్దు. ఒక వేళ రావాలని ప్రయత్నం చేస్తారేమో.. రావద్దు. చిరునవ్వుతో తిరిగి వెనక్కి వెళ్లిపోండి అని రాసి ఉంచారు. అంతలా తన వైద్య సేవల్ని అందించడంలో నిమగ్నమయ్యేవారు.

ఆయన ఎందుకంత ప్రత్యేకం
50 సంవత్సరాలకు పైగా వైద్య రంగంలో సేవ చేసిన ఆయన రూ.2 రూపాయలకే వైద్యం పొందేలా అవకాశం కల్పించారు. దినసరి కూలీలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజూ అర్ధరాత్రి 2:15 నుండే రోగుల కోసం వైద్య సేవలు ప్రారంభించి.. ఇలా ప్రతి రోజు 300-400 మంది వరకు రోగులకు చికిత్స అందించేవారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే మందులే సూచించేవారు. గోపాల్కు తోడుగా ఆయన సతీమణి డాక్టర్ శకుంతల, సహాయకులు మందులు పంపిణీ చేయడంలో సహాయపడేవారు.

డాక్టర్గోపాల్చేసిన సేవలకు గాను
డాక్టర్గోపాల్చేసిన సేవలకు గాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నుండి కేరళలో ఉత్తమ ఫ్యామిలీ డాక్టర్ అవార్డు పొందారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన సేవలను ప్రశంసిస్తూ “ప్రజల డాక్టర్” అని అభివర్ణించారు. ఆయన దగ్గరకు వెళ్లడం అంటే మందు (మెడిసిన్‌) కోసం కాదు, ప్రేమ కోసం అని స్థానికులు చెబుతుండగా..‘ఆయనను కలిస్తే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇట్టే తగ్గిపోతుందనేది రోగుల నమ్మకం. డాక్టర్ గోపాల్‌ తదనంతరంతో ఆయన సోదరులు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రాజగోపాల్‌లు వైద్య సేవల్ని కొనసాగించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement