కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ ఎన్నిక | Dk Shivakumar Elected As Karnataka Clp Leader | Sakshi
Sakshi News home page

కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ ఎన్నిక

May 30 2026 5:27 PM | Updated on May 30 2026 5:33 PM

Dk Shivakumar Elected As Karnataka Clp Leader

బెంగళూరు: కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ ఎన్నికయ్యారు. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. కర్ణాటక సీఎల్పీ భేటీ ఆలస్యంగా ప్రారంభమైంది. సమావేశానికి ఆలస్యంగా చేరుకున్న ఆపద్ధర్మ సీఎం సిద్ధరామయ్య.. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించారు. డీకే పేరును ప్రతిపాదించిన అనంతరం సిద్ధరామయ్య సమావేశం నుంచి వెళ్లిపోయారు. డీకే శివకుమార్‌,, గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. జూన్‌ 3న సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు.

మరోవైపు, కొత్తగా ఏర్పడనున్న మంత్రివర్గంలో చోటు కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లాబీయింగ్‌ ప్రారంభించారు. చాలామంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకమాండ్‌తో మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

తమ సన్నిహిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. తమ వర్గానికి అత్యధిక మంత్రి పదవులు దక్కించుకునేందుకు ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. ఈసారి మంత్రివర్గంలో కొత్తముఖాలకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతుందని ఊహాగానాలు సాగుతున్న తరుణంలో సీనియర్‌ మంత్రులు, ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గీయుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. 40 మందికి పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు.

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement