6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్‌

DCGI Gives Emergency Use Covaxin For Children Aged 6-12 Years - Sakshi

న్యూఢిల్లీ: కోవాగ్జిన్‌ టీకాను 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మంగళవారం అ‍త్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ అత్యవసర వినియోగానికి కొన్ని పరిమితులు విధించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతవరకు డీసీజీఐ12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్‌ టీకాలు వేసేందేకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్‌ 21న ఆమోదం లభించింది.

అంతేకాదు టీనేజ్‌ టీకా కార్యక్రమం ఈ ఏడాది జనవరి మూడు నుంచి ప్రారంభించింది. తదనంతరం మార్చి 16న 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌లు వేసే కార్యక్రమం ప్రారంభించింది. అయితే గతంలో డీసీజీఐ నిపుణుల కమిటీ 2 నుంచి 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌లు ఇచ్చేందుకు మరిన్ని వివరాలను సమర్పించాలని కోరిన సంగతి తెలిసిందే.

(చదవండి: 2 వేలకు పైగా కొత్త కేసులు...మళ్లీ మాస్క్‌ ధరించాల్సిందే)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top