రాజస్తాన్‌లో ఘోరం.. మహిళపై రేప్‌.. ఆపై సజీవదహనం | Dalit woman molestation and burnt in Rajasthan Barmer district | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌లో ఘోరం.. మహిళపై రేప్‌.. ఆపై సజీవదహనం

Apr 9 2023 3:54 AM | Updated on Apr 9 2023 7:55 AM

Dalit woman molestation and burnt in Rajasthan Barmer district - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. ఓ దుర్మార్గుడు దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెకు నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది.

బార్మెర్‌ జిల్లాకు చెందిన దళిత మహిళ(30) ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన షకూర్‌ఖాన్‌ అనే వ్యక్తి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన అనంతరం యాసిడ్‌ వంటి ద్రావకాన్ని ఒంటిపై పోసి, నిప్పంటించి పరారయ్యాడు. 50 శాతం గాయాలపాలైన బాధితురాలు జోథ్‌పూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement