కోర్టు ఉత్తర్వు.. అయ్యప్ప స్వామి యాత్రికులపై పరిమితి | Court imposes restrictions on Ayyappa Swamy pilgrims | Sakshi
Sakshi News home page

కోర్టు ఉత్తర్వు.. అయ్యప్ప స్వామి యాత్రికులపై పరిమితి

Apr 8 2026 7:27 PM | Updated on Apr 8 2026 7:58 PM

Court imposes restrictions on Ayyappa Swamy pilgrims

తిరువనంతపురం: కేరళ హైకోర్టు  కీలక ఉత్తర్వును జారీ చేసింది.  2026–27 మండల-మకర విళక్కు యాత్రా కాలంలో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్యపై పరిమితి విధించింది.

స్వామివారి దర్శనానికి రోజుకు గరిష్టంగా 75,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. భక్తుల భద్రతను పర్యవేక్షించడం, రద్దీని నియంత్రించడం మరియు క్యూ లైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా చూడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

కేరళ కోర్టు తీర్పు ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అయ్యప్పస్వామి యాత్రికులకు వర్తిస్తుంది. కోర్టు తీర్పుతో స్వామి దీక్షకు వెళ్లే భక్తులు ముందుగానే తమ దర్శన టిక్కెట్లను 'వర్చువల్ క్యూ' ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, భక్తులు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ వెబ్‌సైట్ ద్వారా వర్చువల్ బుకింగ్ లేదా నీలక్కల్, వండిపెరియార్, పంపా, ఎరుమేలి మరియు చెంగన్నూర్‌ లోని కౌంటర్ల ద్వారా భౌతికంగా బుకింగ్ చేసుకునే స్పాట్ బుకింగ్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement