Karnataka Assembly Elections: 124 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా

Congress Party Announces First List For Karnataka Assembly Elections - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.  అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది.

‘రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిటీ ఖరారు చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా ఇదే’ అంటూ పార్టీ అభ్యర్థుల జాబితాను ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ప్రకటించిన తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్లు ఉన్నాయి.

కాగా డీకే శివకుమార్‌ కనకపుర స్థానం నుంచి పోటీ చేస్తుండగా.. సిద్ధరామయ్య ఈ సారి కోలార్‌ స్థానం నుంచి కాకుండా వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆయన కుమారుడు యతీంద్ర తన సీటును త్యాగం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే.. చీతాపూర్‌ నుంచి, మాజీ ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర కోరటగెరె స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు పార్టీ ప్రకటించింది.

అయితే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్‌ ప్రకటించలేదు. ఈ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తొలి పార్టీ కాంగ్రెస్సే. ఈ ఏడాది మే నెలతో ప్రస్తుత శాసనసభ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉండగా... మేలో పోలింగ్‌ జరిగే అవకాశం ఉంది.

కర్ణాటక ఎన్నికలు: వయసుల వారీగా కాంగ్రెస్ తొలి జాబితా 
30 ఏళ్లలోపు : 1
40 లేదా అంతకంటే తక్కువ: 12
50 లేదా అంతకంటే తక్కువ: 22
55 లేదా అంతకంటే తక్కువ: 26
60 లేదా అంతకంటే తక్కువ: 19
60 : 44 కంటే ఎక్కువ

కాంగ్రెస్‌ తొలి జాబితాలో 20% లింగాయత్‌లకు కేటాయించారు
పంచమశాలి లింగాయత్ 7
రెడ్డి లింగాయత్ 5
సదర్ లింగాయత్ 3
వీరశైవ లింగాయత్ 3
లింగాయత్ (ఇతరులు) 4
బంజిగ లింగాయత్ 3
గణిగ లింగాయత్ 2
నోనాబా లింగాయత్ 1

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top