కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న రాహుల్‌ గాంధీ | Congress leader Rahul Gandhi offers prayers at Kedarnath temple in Uttarakhand | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న రాహుల్‌ గాంధీ

Published Mon, Nov 6 2023 5:49 AM | Last Updated on Mon, Nov 6 2023 5:49 AM

Congress leader Rahul Gandhi offers prayers at Kedarnath temple in Uttarakhand - Sakshi

న్యూఢిల్లీ:  కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రైవేట్‌ హెలికాప్టర్‌లో ఆయన అక్కడికి చేరుకున్నారు. ‘‘కేదార్‌నాథ్‌ క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు చేయడం ఆనందంగా ఉంది. హర హర మహాదేవ్‌’’ అంటూ ఫేస్‌బుక్‌లో రాహుల్‌ పోస్టు చేశారు.

ఆలయాన్ని దర్శించుకున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు. సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఆలయం  ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement