కయ్యాలమారి చైనా.. సరిహద్దుల్లో ఎయిర్‌ బేస్‌ నిర్మాణం?

China Creates Combined Air Defence System Along LAC - Sakshi

ఎల్ఏసీ వెంట కంబైన్డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ నిర్మాణ పనులు

నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న 10 యూనిట్ల పీఎల్‌ఏ సైనికులు

చురుగ్గా సాగుతున్న ఎయిర్‌ పోర్టులు, మిస్సైల్‌ పొజిషనింగ్‌ నిర్మాణాలు

చైనా సరిహద్దుల్లో పొంచి ఉన్న ప్రమాదం

లేహ్‌ (లద్ధాఖ్‌): ఇండో-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. భారత్‌ను కవ్వించేందుకు చైనా వరుసగా దుందూకుడు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌​కంట్రోల్‌ వెంట చైనా నిర్మాణాలు మొదలుపెట్టింది.  ఇటీవల ఇండియన్‌ ఆర్మీ ఇంటిలిజెన్స్‌ వర్గాలకు అందుతున్న సమాచారం ఈ నిర్మాణాలు నిజమే అని చెబుతున్నాయి. 

కంబైన్డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌
టిబెట్‌, జిన్‌జియాంగ్‌ ప్రావిన్సులలో తన సైనిక కార్యకలాపాల్లో చైనా వేగం పెంచింది. ముఖ్యంగా ఇండియాతో సరిహద్దుగా భావిస్తున్న లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌​కంట్రోల్‌ వెంట పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) కదలికలు బాగా పెరిగాయి. ఆర్మీ , ఎయిర్‌ ఫోర్స్‌ ఉపయోగించుకునేలా కంబైన్డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ నిర్మాణ పనులు శరవేగంగా చేపడుతోంది. సరిహద్దు వెంటన తన బలాన్ని పెంచుకునే పనిలో భాగంగా చైనా ఈ నిర్మాణాలు చేస్తోందని భారత్‌ ఆర్మీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్‌ డిఫెన్స్‌తో పాటు మిస్సైల్స్‌ పొజిషనింగ్‌, ఎయిర్‌పోర్టుల నిర్మాణాలను చైనా చేపడుతోంది. 

వెస్ట్రన్‌ థియేటర్‌ ఆధ్వర్యంలో 
పీఎల్‌ఏలో వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ ఎల్‌ఏసీ వెంట భద్రత విధుల నిర్వహిస్తోంది ఉంటుంది. ప్రస్తుతం వెస్ట్రన్‌ థియేటర్‌కి సంబంధించి పది యూనిట్లు ఎల్‌ఏసీ వెంట చురుగ్గా ఉన్నట్టు సమాచారం. కంబైన్డ్‌ ఆర్మీ , ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి అవి సహకారం అందిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు చైనా ఎయిర్‌ఫోర్స్‌ గమనిస్తోంది. గతేడాది నుంచి తూర్పు లద్ధాఖ్‌ ప్రాంతంలో ఇండియా, చైనాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఇరువైపులా సైన్యం ఢీ అంటే ఢీ అన్నట్టుగా మోహరించారు. కానీ ఈసారి చైనా వైపు నుంచి ఆర్మీతో పాటు ఎయిర్‌ఫోర్స్‌ కూడా రంగంలోకి దిగడాన్ని భారత్‌ నిశితంగా గమనిస్తోందని ఆర్మీ వర్గాలు అంటున్నాయి. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top