బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సజావుగా సాగిపోతున్న కుటుంబంలో చిన్న గొడవలే పెద్దవయ్యాయి. కుటుంబ కలహాలతో ఎస్‌ఐ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బీరూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. బీరూరు ఎస్‌ఐ తిప్పేశ్ భార్య పద్మ (35) మంగళవారం రాత్రి ఇంటిలో ప్రాణాలు తీసుకుంది.
బీరూరు పట్టణంలో బాడుగ ఇంటిలో తిప్పేశ్ కుటుంబం ఉంటోంది. పద్మది తుమకూరు జిల్లా కాగా, తిప్పేశ్‌ది దావణగెరె జిల్లా. వీరిద్దరూ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కానీ పిల్లలను ఎక్కడ చదివించాలి, సెలవుల గురించి గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేపట్టారు.


