SC: ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కమిటీ ఏర్పాటు | Centre Appoints SC Committee | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కమిటీ ఏర్పాటు

Jan 19 2024 11:22 AM | Updated on Jan 19 2024 11:35 AM

Centre Appoints SC Committee  - Sakshi

ఎస్సీల వర్గీకరణ విషయంలో ఇచ్చిన మాట ప్రకారం కేంద్రం ముందడుగు వేసింది. కేబినెట్‌ కార్యదర్శి .. 

ఢిల్లీ: ఎస్సీల(Scheduled Castes communities) వర్గీకరణ విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో..పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement