దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ

Published Wed, Oct 18 2023 4:06 PM

Central Government Clears Transfers Of 16 High Court Judges - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పదహారు మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ట్రాన్స్‌ఫర్‌ అయిన జడ్జిల్లో ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలు, తెలంగాణకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. 

బదిలీ అయిన న్యాయమూర్తుల వారి జాబితా

1. జస్టిస్‌ ఎస్పీ కేసర్‌వాణి( అలహాబాద్‌ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ)

2. జస్టిస్‌ రాజ్‌ మోహన్‌ సింగ్‌( పంజాబ్‌-హర్యాణా హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ)

3. జస్టిస్‌ నరేందర్‌ జీ( కర్ణాటక హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ)

4. జస్టిస్‌ సుధీర్‌ సింగ్‌(పాట్నా హైకోర్టు నుంచి పంజాబ్‌, హర్యానా కోర్టుకు బదిలీ

5. జస్టిస్‌ ఎంవీ మురళిధరన్‌( మణిపూర్‌ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ)

6. జస్టిస్‌ మధురేష్‌ ప్రసాద్‌ (పాట్నా హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ)
ఎపి హైకోర్టులో ఇద్దరు జడ్జిలు బదిలీ

7. జస్టిస్ అరవింద్ సింగ్ సాంగ్వాన్ (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ)

8. జస్టిస్ అవనీష్ జింగాన్ (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ)

 9. జస్టిస్ అరుణ్ మోంగా (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ)

0. జస్టిస్ రాజేంద్ర కుమార్ (అలహాబాద్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ)

11. జస్టిస్ నాని టాగియా [గువాహతి హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ)

12. జస్టిస్ సి మానవేంద్రనాథ్ రాయ్ [ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి హైకోర్టు గుజరాత్ హైకోర్టుకు బదిలీ)

13. జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ [తెలంగాణ హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ

14. జస్టిస్ జి అనుపమ చక్రవర్తి [తెలంగాణ హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ)

15. జస్టిస్ లపితా బెనర్జీ (అదనపు న్యాయమూర్తి) (కలకత్తా హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ)

16. జస్టిస్ దుప్పల వెంకట రమణ (అదనపు న్యాయమూర్తి) (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ)

‘‘ఇక్కడ క్లిక్‌ చేసి సాక్షి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి’’

Advertisement
 
Advertisement