Bharat Jodo Yatra: వడివడిగా రాహుల్‌ పాదయాత్ర | Bharat Jodo Yatra: Rahul Gandhi Bharat Jodo Yatra enters Karnataka | Sakshi
Sakshi News home page

Bharat Jodo Yatra: వడివడిగా రాహుల్‌ పాదయాత్ర

Oct 2 2022 5:10 AM | Updated on Oct 2 2022 5:12 AM

Bharat Jodo Yatra: Rahul Gandhi Bharat Jodo Yatra enters Karnataka - Sakshi

పాదయాత్రలో రాహుల్, సిద్దరామయ్య

మైసూరు: భారత్‌ జోడో యాత్ర కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా నుంచి శనివారం మైసూరు జిల్లాలో ప్రవేశించింది. శనివారం ఉదయం వర్షం కారణంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాదయాత్రను సుమారు గంట ఆలస్యంగా ప్రారంభించారు. జిల్లాలోని తొండవాడి గేట్‌ వద్ద నుంచి ప్రారంభమైన యాత్రలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్దరామయ్య పాల్గొన్నారు.

మధ్యాహ్నం వరకు సుమారు 15 కిలోమీటర్ల దూరం నడిచి భోజనానంతరం సాయంత్రం 4 గంటల వరకు విశ్రాంతి తీసుకున్నారు. నంజనగూడు తాలూకా తాండవపురలోని ఎంఐటీ కళాశాల ఎదురుగా రాహుల్‌గాంధీ బస చేశారు. యాత్రకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. నడకలో రాహుల్‌ వేగాన్ని అందుకునేందుకు సీనియర్‌ నేతలు ఇబ్బంది పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement