మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా జరిగిన పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆయనకు ఆల్కహల్ టెస్ట్ చేయాలని పట్టుబట్టాయి.
ముఖ్యమంత్రి మద్యం మత్తులో సభకు వచ్చారని ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై స్పందించిన ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా రాష్ట్ర అధినేతపై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున సభలోని సభ్యులందరికీ అల్కాహాల్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక దినోత్సవం నాడు ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడం "అత్యంత సిగ్గుచేటు" అని మండిపడ్డారు. ఆయన ప్రజల సమక్షంలో డోప్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డోప్ పరీక్ష డిమాండ్ ను స్పీకర్ తిరస్కరించారు.
అయితే ప్రతిపక్షాల నిరసనలతో సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ సమావేశం కార్మిక దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశమని దయచేసి సభ్యులంతా సభామర్యాదలు పాటించాలని కోరారు. మేడే సందర్బంగా పంజాబ్ ప్రభుత్వం ఈ ప్రత్యేక సమావేశాన్ని కార్మికులకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసింది.
అయితే గత నెల ఏప్రిల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు, [రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్ బీజేపీలో విలీనమయ్యారు. దీనికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ చర్యతో రాజ్యసభలో బీజేపీ బలం 113కి పెరగగా, ఆప్ బలం 3కి పడిపోయింది, దీనిని 'రాజ్యాంగ విరుద్ధం' అని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది.



