
ఘట్టాలు
ఆరోగ్య కారణాలతో జైలు నుంచి గాంధీజీ ముందే విడుదల.
నార్త్–వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సులో మత కలహాలు. రావల్పిండిని ఖాళీ చేసి వెళ్లిపోయిన హిందువులు.
ఇండియాలో తొలిసారి పట్టాలెక్కిన ఎలక్ట్రిక్ ట్రైన్ (ముంబై లోని విక్టోరియా టెర్మినస్ నుంచి శివారు ప్రాంతమైన కుర్లా వరకు).
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) ఆవిర్భావం.
కాన్పూర్‌లో భారతీయ కమ్యూనిస్టు పార్టీ స్థాపన.
చట్టాలు
(1925) ఇండియన్ సక్సెషన్ యాక్ట్, ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్, సిఖ్ గురుద్వారాస్ (సప్లిమెంటరీ) యాక్ట్, ఇండియన్ సోల్జర్స్ (లిటిగేషన్) యాక్ట్, ప్రావిడెంట్ ఫండ్స్ యాక్ట్, కోల్ గ్రేడింగ్ బోర్డ్ యాక్ట్, కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీస్ యాక్ట్.
జననాలు
ఎం. కరుణానిధి : తమిళనాడు సీఎం; ఎస్.ఆర్.బొమ్మయ్ : కర్ణాటక సీఎం; రాజ్‌కపూర్ : సినీ నటులు, దర్శకులు (పెషావర్); అటల్ బిహారీ వాజ్‌పేయి : దేశ ప్రధాని (గ్వాలియర్); మహహ్మద్ రఫీ : సినీ గాయకులు (పంజాబ్); సూర్యకాంతం : (కాకినాడ); ఎం.ఎస్.రెడ్డి : సినీ నిర్మాత (నెల్లూరు); చిత్తజల్లు కృష్ణవేణి : నటి, గాయని (ప.గో.)
కాకర్ల సుబ్బారావు : రేడియాలజిస్టు (కృష్ణా); గురు దత్ : సినీ దర్శకులు, నటులు (బెంగళూరు); దాశరథి కృష్ణమాచార్యులు : కవి, రాజకీయ కార్యకర్త (మహబూబాబాద్ జిల్లా); ఎం.ఎస్.స్వామినాథన్ : వ్యవసాయ శాస్త్రవేత్త (కుంభకోణం); సత్యసాయి బాబా : ఆధ్యాత్మిక గురువు (పుట్టపర్తి); భానుమతి : నటి (దొడ్డవరం); రాజా రామన్న : భౌతిక శాస్త్రవేత్త (కర్ణాటక); ఎస్. వరలక్ష్మి : (జగ్గంపేట).