Key Events Of India Independence: వ్యక్తులు, ఘటనలు (ప్రీ–ఫ్రీడమ్, పోస్ట్‌ ఫ్రీడమ్‌)

Azadi Ka Amrit Mahotsav Birsa Munda Death Know About Ulgulan Movement - Sakshi

గిరిజనోద్యమాలలో బిహార్‌లోని ఛోటానాగ్‌పూర్, రాంచీ పరిసరాలలో ముండా తెగ గిరిజనులు నిర్వహించిన పోరాటానికి నాయకత్వం వహించిన యోధుడే.. బీర్సా ముండా. భూమి మీద తన తెగ ప్రజలు, ఇతర గిరిజన తెగల సోదరులు కోల్పోయిన హక్కు ఆయనను ఒక పెద్ద ఉద్యమానికి పురికొల్పింది. వలస పాలన, దాని చట్టాలు అడవులలో వ్యవసాయక విధానాన్ని భూస్వామిక వ్యవస్థలో భాగం చేసింది. దీనికి వ్యతిరేకంగానే అక్కడ ఉద్యమం వచ్చింది.

బీర్సా జన్మించడానికి (1875) ఒక్క సంవత్సరం ముందే ముండా, ఒరాన్‌ గిరిజన తెగలు తమ భూములను పూర్తిగా కోల్పోయి, థికాదారుల పొలాలలో కూలీలుగా పనిచేస్తూ బతికే స్థితికి చేరుకున్నారు. 1875 నాటికి 150 అటవీ గ్రామాల మీద పూర్తి ఆధిపత్యం సాధించారు.  ఫలితంగా వలస పాలకులకు, వీరికి మధ్య ఘర్షణ ఉద్ధృతం అయింది. 1900 మార్చి 3న బీర్సా అడవిలో ఆదమరచి నిద్రపోతూ ఉండగా పోలీసులు అరెస్టు చేశారు.

ఆయనతో పాటు 460 మంది మీద తీవ్రమైన కేసులు నమోదు చేశారు. విచారణలో ఉండగానే ఆరుగురు మరణించారు. ఇదంతా రాంచీ జైలులో జరిగింది. అక్కడే 1990 జూన్‌  9 న బీర్సా హఠాత్తుగా కన్నుమూశాడు. అధికారులు మాత్రం అతడు విష జ్వరంతో మరణించాడని చెప్పారు. కానీ విషప్రయోగం వల్లనే చనిపోయాడని సాటి ఖైదీల వాదన. ఈ ఉద్యమానికే చరిత్రలో ఉల్‌గులాన్‌  అని పేరు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top