కాస్త మెరుగైన ఢిల్లీ వాయు నాణ్యత

Air pollution in Delhi drops from severe to very poor, stringent curbs revoked - Sakshi

కొన్ని ఆంక్షలను సడలించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత కాస్తంత మెరుగవడంతో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. వాయు కాలుష్యం అత్యంత తీవ్రం (సివియర్‌) నుంచి అతి తీవ్రం (వెరీ పూర్‌)కు చేరుకుందని వివరించింది. దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ సంబంధ పనులపై నిషేధాన్ని తొలగించింది. కాలుష్యాన్ని వెదజల్లే ట్రక్కుల ప్రవేశానికి అనుమతించింది. గాలి దిశ మారడం, గాలి వేగం పెరగడంతో కాలుష్య తీవ్రత తగ్గినట్లు వివరించింది.

ప్రస్తుతం చివరిదైన నాలుగో దశకు సంబంధించి ఎయిర్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ ప్లాన్, గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌(జీఆర్‌ఏపీ)ని అనుసరించి ఢిల్లీలో ఆంక్షలు అమలవుతున్నాయని తెలిపింది. నగరంలోని 24 గంటల సగటు వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) శుక్రవారం 405 కాగా శనివారానికి అది 319కి తగ్గిపోయిందని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top