దేశంలో కొత్తగా 86,821 పాజిటివ్‌ కేసులు | 86821 New Corona Positive Cases Recorded In India | Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 86,821 పాజిటివ్‌ కేసులు

Oct 1 2020 9:55 AM | Updated on Oct 1 2020 11:25 AM

86821 New Corona Positive Cases Recorded In India - Sakshi

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,12,585కి చేరింది. వైరస్‌బారినపడి ఇప్పటి వరకు 98,678 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 85,376గా నమోదు అయ్యింది. ఇప్పటి వరకు 52,73,201మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 9,40,705 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 83.53 శాతంగా నమోదైంది. మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.56 శాతానికి తగ్గింది. ఇక దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 14,23,052 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు మొత్తం 7,56,19,781 పరీక్షలు చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ జారీచేసింది. (వ్యాక్సిన్‌ వాస్తవాలు: అందుబాటులోకి వచ్చేదెలా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement