చనిపోయిన రెండేళ్ల తరువాత వెలుగులోకి నిజం

2 years After woman death Report Confirms Rape in Bhopal - Sakshi

భోపాల్‌: ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడి దాదాపు రెండేళ్ల అయిన తర్వాత ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది. శుక్రవారం సాయంత్రం బైరాసియా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికలో  ఆమెపై అత్యాచారం జరిగిందని ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు శుక్రవారం ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించారు. దీని గురించి టౌన్ ఇన్స్పెక్టర్ బైరాసియా కైలాష్ నారాయణ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ‘నవంబర్ 2018 లో, మహిళ కడుపు నొప్పి అని చెప్పడంతో ఆమెను బైరాసియాలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ నుండి ఆమెను భోపాల్ నగరంలోని హమీడియా ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా డాక్టర్లు తెలిపారు. హమీడియా ఆసుపత్రికి వెళ్ళే మార్గ మధ్యలో ఆమె విషం తాగినట్లు తన సోదరుడికి తెలిపింది. తరువాత, ఆమె సోదరుడు దాని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు ” అని  ఆయన తెలిపారు.

అయితే, ఈ కేసులో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆరోపణలు లేవని,  ఆమె మరణించిన తరువాత, పోస్ట్ మార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఆమె విసెరాను భోపాల్ లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) కు పోస్ట్‌ మార్టం పరీక్ష కోసం పంపినట్లు భరద్వాజ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉపేంద్ర జైన్ మాట్లాడుతూ “మాకు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వచ్చింది. నివేదిక ప్రకారం, మహిళపై అత్యాచారం జరిగింది. ఇప్పుడు, మేము తాజా దర్యాప్తును ప్రారంభిస్తాం. దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తాం’ అని పేర్కొన్నారు. ఎయిమ్స్, భోపాల్ డైరెక్టర్ డాక్టర్ శర్మన్ సింగ్ మాట్లాడుతూ, “విషం కారణంగా మరణిస్తే, విసెరా రసాయన పరీక్ష చాలా ముఖ్యం, అయితే ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోతే విసెరాతో పాటు జననేంద్రియాల ద్రవాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె విషం తాగినట్లు తేలింది. అదేవిధంగా ఆమె పై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయ్యింది’ అని తెలిపారు.

చదవండి: ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర, పోలీసుల చెక్‌

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top