నేడు సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ ముగింపు | - | Sakshi
Sakshi News home page

నేడు సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ ముగింపు

Apr 24 2026 7:50 AM | Updated on Apr 24 2026 7:50 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్‌ఖేల్‌ మహోత్సవ ముగింపు వేడుకలను జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. అలాగే అతిథులుగా అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్‌, గొంగిడి త్రిషారెడ్డి, డబ్ల్యూపీఏల్‌ మహిళా క్రికెటర్‌ త్రిషా పూజితలు హాజరుకానున్నారు. ముగింపు వేడుకల సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా.. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, పీఎంఎస్‌కేఎం పార్లమెంట్‌ ఇన్‌చార్జి జనార్దన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్‌ కిరణ్‌కుమార్‌, నవీన్‌కుమార్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.

గవర్నర్‌తో పీయూ వీసీ సమావేశం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జాతీయ విద్యావిధానంలో భాగంగా విజయ్‌ అండ్‌ మిషన్‌ అమలులో పాలమూరు యూనివర్సిటీ పాత్ర, 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పీ యూలో జరిగిన కార్యక్రమాలపై గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా ఆఽ ద్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వీసీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీయూ అధ్యాపకులు జాతీయ, అంతర్జాతీయ పేటెంట్స్‌ పొందారని, రీసెర్చ్‌కు మరింత ప్రోత్సాహం ఇస్తున్నట్లు వీసీ వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement