నారాయణపేట: జిల్లావ్యాప్తంగా కుక్కల దాడులు క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలో 24, 745 మంది కుక్కకాటుకు గురికాగా.. ఈ ఏడాది మూ డు నెలల్లోనే 1,773 మంది కుక్కకాటుతో ప్రభుత్వాస్పత్రులకు పరుగులు తీయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చిన్నారులు, వృద్ధులే కాక.. ఈ ఏడాది 207 గొర్రెలు, 586 మేకలపై కుక్కలు దాడు లు చేసినట్లు పశుసంవర్ధక శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థలు, మున్సిపల్ పాలకవర్గాలు, అధికార యంత్రాంగం కుక్కల నియంత్రణకు సరైన చర్యలు తీసుకోకపోవడంలో తీవ్రంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
మొక్కుబడిగా..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించాలని ఉన్నతా ధికారులు ఆదేశిస్తున్నా.. అధికార యంత్రాంగం మాత్రం మొక్కుబడిగా నిర్వహిస్తుందనేది స్పష్టంగా కనబడుతుంది. నారాయణపేట మున్సిపాలిటీలో 725 శునకాలకు గాను దాదాపు 430 శునకాలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించారు. మద్దూర్, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీలో మొక్కుబడిగానే జరుగుతుంది. కాగా జిల్లాలోని 272 జీపీల్లో వీధి కుక్కలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. రోజురోజుకూ వాటి సంతతి పెరుగుతుంది. వీధి కుక్కలను వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగకపోవడంతో వాటి బారిన పడిన వారికి ప్రాణాంతకమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలో..
గాయపడిన చిన్నారి (ఫైల్)
ఈ ఏడాది 207 గొర్రెలు.. 586 మేకలపై దాడులు
ఐదేళ్లలో జిల్లాలో కుక్కకాటు కేసులు 24,725
ఈ ఏడాదిలో 1,773 మందిపై దాడి
స్టెరిలైజేషన్ అంతంతే
వణికిస్తున్న వీధి కుక్కలు


