ప్రత్యామ్నాయం ఏది? | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయం ఏది?

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

ప్రత్యామ్నాయం ఏది? దోపిడీని అరికట్టాలి హామీని నిలబెట్టుకోవాలి

నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్ర యాణాలు సాగించి గమ్య స్థానాలకు చేరుకునే ప్ర యాణికులకు సమ్మె కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 40 రోజుల ముందు కార్మికులు నోటీసు ఇచ్చినా ప్రభు త్వం పట్టించుకోకపోవడం సరికాదు. కార్మికుల సమస్యలు పరిష్కారానికి నో చుకోకపోయినా, సమ్మెను గుర్తించి ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైంది.

– రాజేష్‌, మొబైల్‌ షాప్‌ నిర్వాహకుడు,

కొల్లంపల్లి.

సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలు ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎండల తీవ్రతకు ఎక్కువసేపు బస్టాండ్‌, రోడ్డుపైన నిలబడలేక తప్పని పరిస్థితుల్లో ప్రజలు డబ్బులు ఎక్కువ చెల్లించి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అధికారులు దృష్టి సారించి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి.

– డాక్టర్‌ విరోజ, వైద్యురాలు, చిన్నజట్రం

ఎన్నికల ప్రచారంలో ఆర్టీ సీ కార్మికులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకో వాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. యూనియన్లను పునరుద్ధరించడంతో పాటు పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులను విస్మరించడం సరికాదు.

– సురేష్‌, కండక్టర్‌, నారాయణపేట

Advertisement
 
Advertisement
Advertisement