కోస్గి రూరల్: రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఫర్టిలైజర్స్ దుకాణ యజమానులు ఎరువుల నిల్వలను సమృద్ధిగా ఉంచుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్ సూచించారు. బుధవారం గుండుమాల్ మండలంతో పాటు కోస్గి పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులను రైతుల అవసరాల మేరకు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులందరూ యూరియా యాప్‌ను తప్పనిసరిగా వాడలన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన పారాక్వాట్ కలుపు మందును పూర్తిగా నిషేధించిందని, ఎవరైనా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు దుకాణాల్లో బిల్ బుక్స్, రికార్డులను, యూరియా, డీఏపీ నిల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ రామకృష్ణ ఉన్నారు.


