ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీఓ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీఓ

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

ఎస్పీ డా. వినీత్‌

నారాయణపేట: మరో ఆరునెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన నారాయణపేట ఆర్డీఓ పి.రాంచందర్‌ నాయక్‌ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య వివరాల మేరకు.. జిల్లాలోని ఊట్కూ ర్‌కు చెందిన ఓ వ్యక్తి తనతో పాటు మరో నలుగురికి సంబంధించిన బర్త్‌ సర్టిఫికెట్ల కోసం గతేడాది జూలైలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ నుంచి తహసీల్దార్‌ లాగిన్‌లోకి వెళ్లిన దరఖాస్తులు.. అక్కడి నుంచి ఆర్డీఓ లాగిన్‌కు ఫార్వర్డ్‌ అయ్యాయి. అయితే దరఖాస్తు చేసుకున్న 45 రోజులలోగా విచారణ చేపట్టి, బర్త్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాల్సి ఉండగా.. 10 నెలలు అవుతున్నా ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోయారు. వారం రోజులుగా డివిజనల్‌ కార్యాలయానికి తిరుగుతూ బర్త్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్డీఓను వేడుకున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇస్తే జారీ చేస్తామని ఆర్డీఓ చెప్పినట్లు ఆ కార్యాలయంలోని సెక్షన్‌ అధికారి దరఖాస్తుదారుడికి చెప్పినట్లు తెలిసింది. అన్ని డబ్బులు ఇ చ్చుకోలేమని రూ.5 వేల చొప్పున ఇస్తా మని సదరు అధికారి ద్వా రా ఆర్డీ ఓతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని మూ డు రోజుల క్రితం ఏసీ బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందుగా బర్త్‌ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆర్డీఓ కార్యాలయంలోకి పంపించా రు. సదరు వ్యక్తి నుంచి ఆర్డీఓ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్డీఓకు సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని నివాసగృహంతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలంలోని మరో ఇంట్లో, తన కుటుంబీకుల నివాసాల్లో సైతం ఏసీబీ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఆర్డీఓ కార్యాలయంలోని భూ దరఖాస్తులు, కంప్యూటర్‌లోని డేటా, మిగతా అంశాలపై ఆర్డీఓను విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఆర్డీఓను అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

మాట్లాడుతున్న ఎస్పీ డా. వినీత్‌

నారాయణపేట: జిల్లాలో నమోదవుతున్న కేసు ల విచారణను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని, ప్రతి కేసును లోతుగా విచారించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ డా. వినీత్‌ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీ సు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐ లు, అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ముందుగా పెండింగ్‌, యూఐ కేసుల వివరాలు అడిగి తెలుసుకొని పెండింగ్‌కు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని, మహిళా, బాలికల నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజిబుల్‌ పోలీసింగ్‌, నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. బాధితులకు మరింత సౌకర్యం కల్పించడానికి ఇంటి వద్దకు వెళ్లి ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సూచించారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా పని చేయాలన్నారు. అలాగే పార్ట్‌–1, పార్ట్‌–2 స్టేట్‌మెంట్‌ రికార్డ్‌, సీడీఎఫ్‌, రిమాండ్‌ డైరీ, చార్జ్‌షీట్‌ నమోదు, ఆస్తుల జప్తు, నిందితుల వివరాల నమోదు తదితర అంశాలపై ఎస్‌హెచ్‌ఓలకు తగిన సూచనలు చేశారు. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన హాట్‌స్పాట్లలో ప్రమాదాలు జరగుకుండా ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి అవసరమైన సిగ్నల్స్‌, తగిన మార్పులు చేర్పులు చేపట్టాలన్నారు. ఎస్‌ఐలు తప్పనిసరిగా గ్రామాలను సందర్శించాలని, బ్లూ కోల్ట్స్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన విధులు నిర్వర్తించేలా అధికారులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేయాలనినాదేశించారు. ప్రాపర్టీ నేరాలపై నిఘా ఉంచాలని, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ఏర్పాటు చేసుకునేలా కృషి చేయాలని తెలిపారు. 5 విధానంలో భాగంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఫైళ్లను క్రమపద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, మహేష్‌, సీఐలు శివశంకర్‌, రాంలాల్‌, భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజు, విజయ్‌కుమార్‌, బాలరాజు, వెంకటేష్‌గౌడ్‌, రమేష్‌, భాగ్యలక్ష్మిరెడ్డి, అశోక్‌బా బు, నవీద్‌, నరేష్‌, విజయభాస్కర్‌, పురుషోత్తం, శ్రీనివాసులు, సునీత, గాయత్రి, రేవతి, మహేశ్వరి, స్టేషన్‌ రైటర్లు పాల్గొన్నారు.

బర్త్‌ సర్టిఫికెట్ల జారీకి

రూ.25 వేల లంచం డిమాండ్‌

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న

ఏసీబీ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement