హెచ్‌పీవీ.. అంతంతే! | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ.. అంతంతే!

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

30 రోజులు.. 170 టీకాలు

నర్వ: మహిళలను గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ వెంటాడుతోంది. దీని నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా మార్చి 8న కార్యక్రమం ప్రారంభం కాగా.. 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసున్న బాలికలకు టీకాలు వేస్తున్నారు. కానీ అవగాహన లోపంతో ఈ కార్యక్రమం ముందుకు సాగడం లేదు.

9, 10 తరగతుల విద్యార్థులే..

జిల్లావ్యాప్తంగా 7,325 మంది కిశోర బాలికలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో చాలామంది 9, 10 తరగతి చదివే వారే. వీరు వార్షిక పరీక్షల సన్నద్ధతలో ఉండటంతో టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడం లేదు. మూడు నెలల పాటు కొనసాగే కార్యక్రమంలో 45 రోజులు పూర్తయ్యాయి. మార్చి 8 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 65 సెషన్లు నిర్వహించి సుమారు 170 మంది బాలికలకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. మొదటి వారం ఉత్సాహంగా సాగినా.. తర్వాత పండుగలు, పరీక్షలు రావడంతో బాగా తగ్గింది. మరో రెండు నెలల్లో 7 వేల మందికి టీకాలు వేయాల్సి ఉంది.

మండలాల వారీగా టీకాల పంపిణీ..

కోస్గి 35

మద్దూర్‌ 61

నారాయణపేట 17

మక్తల్‌ 57

14 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు

బాలికలకు పంపిణీ

గర్భాశయ క్యాన్సర్‌కు అడ్డుకట్ట

వేసేందుకే..

జిల్లాలో 7,325 మంది

కిశోర బాలికలు

సద్వినియోగం చేసుకోవాలంటున్న వైద్యశాఖ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement