జిల్లాలోని కిశోర బాలికలు హెచ్‌పీవీ టీకా తీసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలో ని కోస్గి, మద్దూర్, నారా యణపేట, మక్తల్ జీజీహెచ్, ఏహెచ్, సీహెచ్‌సీల లో 170 మందికి టీకాలు అందించాం. మంగళవారం నుంచి అన్ని మండలాల పీహెచ్‌సీల్లో టీకాల పంపిణీ ప్రారంభమైంది.టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదు. గర్భాశయ క్యా న్సర్‌ను పూర్తిస్థాయిలో అడ్డుకుంటుంది. ఆడపిల్లలకు ఇది మంచి అవకాశం. దీనిపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. కిశోర బాలికలు టీకా పంపిణీని సద్వినియోగం చేసుకోవాలి.
– డా. జయచంద్రమోహన్,
జిల్లా వైద్యాధికారి
●


