వారాంతపు సంతలో గంపకు రూ.50 తీసుకుంటున్నారు. గంటల తరబడి ఎండలో కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్నాం. తాగునీరు, నీడ సౌకర్యం లేక పోవడంతో ఎండకు తట్టుకోలేక డబ్బులు పెట్టి నీళ్లు కొని తాగుతున్నాం. కొనుగోలుదారులు కూడా మాలాగే ఇబ్బందులు పడుతున్నారు. సంతలో కనీస మౌలిక సదుపాయలు కల్పించాలి.
– శంకరమ్మ, చిరు వ్యాపారి, తీలేరు
తాగునీటి వసతి లేదు..
ఎన్నో ఏళ్లుగా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ సంతలో కూరగాయలు విక్రయిస్తున్నా. వేసవిలోనైనా తాగునీటితో పాటు నీడ సౌకర్యం కల్పించాలని కార్యదర్శి విన్నవించినా పట్టించుకోవడం లేదు. చేసేది లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడుగు పట్టుకొని వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. – రాములు, కూరగాయల వ్యాపారి, మరికల్
కనీస సౌకర్యాలు కల్పిస్తాం..
వారాంతపు సంతల్లో తాగునీటితో పాటు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తాం. నీడ కోసం టెంట్లు వేసే నిబంధన తైబజార్ వేలంలో లేదు. కనీస వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటాం. – సుధాకర్‌రెడ్డి, డీఎల్పీఓ, నారాయణపేట
●


