కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలో కేఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడి నుంచే సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ ద్వారా తరలిస్తారు. ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ఐదు మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక మోటారు 5 ఏళ్ల క్రితం, మరో మోటారు రెండేళ్ల క్రితం దెబ్బతింది. నాటినుంచి మిగిలిన మూడు మోటార్లతోనే ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్కో పంపు ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో వాటిపై భారం పడుతోంది.


