దొడ్డి కొమురయ్య పోరాటం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

దొడ్డి కొమురయ్య పోరాటం ఆదర్శనీయం

Apr 4 2026 8:55 AM | Updated on Apr 4 2026 8:55 AM

నారాయణపేట: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని కలెక్టరేట్‌ ఏఓ శ్రీధర్‌ బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్‌ ఖలీల్‌, డీపీఆర్‌ఓ రషీద్‌ అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ శ్రీధర్‌ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్‌ ఖలీల్‌ మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, సమాన త్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల వార్డెన్లు రేణుక, మంజుల, జ్యోతి, అన్వేష్‌, ముస్తఫా, శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement