విద్యార్థి సామర్థ్యం ఎంత? | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి సామర్థ్యం ఎంత?

Apr 4 2026 8:55 AM | Updated on Apr 4 2026 8:55 AM

నారాయణపేట రూరల్‌: ప్రాథ మిక స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాల పెంపు, చతుర్విధ ప్రక్రియలో రాణించడానికి మూడేళ్లు గా ప్రభుత్వం ఎఫ్‌ఎల్‌ఎన్‌ (తొ లిమెట్టు) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చి న్నారుల్లో తెలుగు, ఆంగ్లం భాష లో చదవడం, రాయడంతో పాటు గణితంలో కూడికలు, తీసివేతలు చేయడం ఎలా ఉందనే విధానాన్ని పరీక్షించేందుకు విద్యాశాఖ ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఫౌండేషన్‌ లెర్నింగ్‌ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్‌) పేరుతో మార్చి 30, 31 తేదీల్లో చేపట్టిన సర్వే చేసేందుకు జిల్లాలో బీఈ డీ, డీఎడ్‌ విద్యార్థులను ఎంపిక చేశారు. 2022లో సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో బేస్‌లైన్‌ సర్వే పేరిట జిల్లావ్యాప్తంగా 123 పాఠశాలల్లో దీన్ని చేపట్టారు. తాజాగా ఎన్సీఈఆర్టీ పైలెట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో 18 పాఠశాలలను ఎంపిక చేసి మరోసారి సర్వే నిర్వహించారు. ఇందుకుగాను జిల్లా స్థాయిలో డీఆర్పీలను ఎంపిక చేసి హైదరాబాద్‌లో శిక్షణ సైతం ఇచ్చారు.

సామర్థ్యాల పెంపే లక్ష్యం..

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్‌ాధ్యలు అంచనా వేసినందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. ప్రతి విద్యార్థి సొంతంగా చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు సాధించేలా కృత్యాధార బోధన కొనసాగేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న బోధన, చిన్నారుల చదువులు ఎలా సాగుతున్నాయో గుర్తించేందుకు మూడో తరగతి విద్యార్థులతో సర్వే చేపట్టింది. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలలో రెండు రోజులపాటు ఈ ప్రక్రియ నిర్వహించారు. సర్వేలు తేలిన అంశాల ఆధారంగా కనీస సామర్థ్యాలు మరింత మెరుగైన బోధనా ప్రక్రియ నిర్ణయించనున్నారు.

సర్వే కొనసాగింది ఇలా..

ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ సర్వే నిర్వహించారు. విద్యార్థులు ఇందులో ప్రతిభ చాటేలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా మాదిరి పరీక్షలు నిర్వహించింది. గత డిసెంబర్‌లో మొదటిసారి, జనవరిలో రెండోసారి, ఫిబ్రవరిలో మూడోసారి మాదిరి పరీక్షలు నిర్వహించారు. ఇక ఫైనల్‌ పరీక్షకు గాను అంత సిద్ధం చేసి జిల్లా కేంద్రం సమీపంలో గల బీఈడీ కళాశాల ఛాత్రోపాధ్యాయులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. ఆయా ఛాత్రోపాధ్యాయులు సంబంధిత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో సర్వే చేపట్టారు. బొమ్మను చూపిస్తూ మాట్లాడించడం, తెలుగు అక్షరాలు, పదాలు, వాక్యాలను గుర్తించి చదవడం, అదేవిధంగా అక్షరాలు, పదాలు రాయించడం, గణితంలో కూడిక, తీసివేత, గుణాకారం, భాగాహారం సంబంధిత సామర్థ్యాలను పరీక్షించారు. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులలో మౌఖిక సామర్థ్యం, అక్షరాలు, పదాలు, వాక్యాలు ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం వంటి వాటిని పరిశీలించారు. ప్రతి పాఠశాలలో 8 నుంచి 10 మంది విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలు మొబైల్‌ యాప్‌లో నమోదు చేశారు.

సర్వే వివరాలు

మూడో తరగతి చిన్నారులకు ఎఫ్‌ఎల్‌ఎస్‌ పరీక్షల నిర్వహణ

జిల్లాలో రెండు రోజులపాటు కొనసాగిన సర్వే

ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లు ఛాత్రోపాధ్యాయులు

ఆన్‌లైన్‌ పోర్టల్‌లో వివరాల నమోదు

18 పాఠశాలల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement