భక్తిశ్రద్ధలతో సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠానోత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠానోత్సవం

Apr 4 2026 8:55 AM | Updated on Apr 4 2026 8:55 AM

దామరగిద్ద: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శిరిడి సాయిబాబ ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన విగ్రహ ప్రతిష్ఠాననోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. సాయి నామస్మరణతో గ్రామం మార్మోగింది. ఆలయ నిర్మాణ దాత వన్నాడ వెంకటప్ప విజయలక్ష్మి దంపతుల సమక్షంలో జరిగిన ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వేదపండితుల సమక్షంలో శిరిడి సాయిబాబ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి, మహా మంగళహారతి పూజలు నిర్వహించారు. కాసా మఠం గుర్మిట్కల్‌ శ్రీ శాంతవీర మృగ రాజేంద్రస్వామి, మల్కేడ్‌ కోటేశ్వర శివాచార్య స్వాములు, అంద్రికే లింగప్పతాత, శ్రీశైలం రుద్రస్వాములు ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహాబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడు సీంజీవ్‌కుమార్‌, నారాయణపేటకు చెందిన బీస్మరాజ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ రాజ్‌కుమార్‌రెడ్డి హాజరై ఆలయ నిర్మాణ దాత వన్నాడ వెంకటప్పను శాలువాతో సత్కరించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement