నారాయణపేట: జిల్లాలో మాదక ద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో మాదక ద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు చేయకుండా వ్యవసాయశాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆయా కమిటీల నేతృత్వంలో మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. నెలవారీ సమావేశంలో చర్చించిన అంశాలు.. తీసుకున్న చర్యల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు, ఎకై ్సజ్‌శాఖ అధికారులు డ్రగ్స్ నియంత్రణకు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రామచందర్‌నాయక్, జిల్లా రవాణా అధికారి మేఘాగాంధీ, డీఐఈఓ సుదర్శన్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ జయసుధ, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను
30 ఎన్‌ఆర్‌పిటి 102 ః మాట్లాడుతున్న రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీను


