ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
కోస్గి: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, చట్టబద్ధంగా, శాంతియుత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని డీఎస్పీ లింగయ్య, డీిసీఆర్‌బీ డీఎస్పీ మహేష్ అన్నారు. గురువారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల కమిషన్ నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. రాజకీయ పార్టీలతో పక్షపాతం లేని విధంగా వ్యవహరించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు అక్రమంగా డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ చేపడితే చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటింగ్ ప్రదేశాల్లో 144 సెక్షన్ అమలు, సీసీ కెమెరాల నిఘా, గొడవలు జరిగితే అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ చుట్టూ 200 మీటర్ల దూరం వరకు ప్రచారం నిషేధం అని, గుంపులుగా ఉండకుండా చూడా లని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ సైదులు ఎస్‌ఐలు బాలరాజు, విజయ్‌కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


