కార్యకర్తలకు అండగా ఉంటా
మక్తల్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని.. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్‌లో ఆయన నివాసంలో మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన దాదాపు 100 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా.. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. నాయకులు లక్ష్మారెడ్డి, కోళ్ల వెంకటేష్, తాయప్ప, వేణు తదితరులు పాల్గొన్నారు.
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే..
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అండర్– 14 విభాగం బాలుర క్రికెట్ జట్టు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగే ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడలకు తరలివెళ్తుండగా వారిని అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చాలని అన్నారు. వెంకటేష్‌శెట్టి, నారాయణ, విష్ణు పాల్గొన్నారు.


