చెక్‌పోస్టుల వద్దఅప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వినీత్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట మండలంలోని జలాల్పూర్ చెక్‌పోస్ట్ (కర్ణాటక బోర్డర్), దామరగిద్ద సమీపంలోని కానుకుర్తి బోర్డర్ చెక్‌పోస్ట్‌లను బుధవారం ఎస్పీ సందర్శించారు.అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎస్‌ఎస్‌టీ టీంలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంలో అక్రమ రవాణా, మద్యం, డబ్బు, ఇతర విలువైన వస్తువుల ప్రవేశాన్ని నిరోధించేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనాల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అవసరమైతే వీడియో రికార్డింగ్‌తో తనిఖీలు కొనసాగించాలన్నారు. జిల్లాలో పరిధిలో 6 బోర్డర్ చెక్‌పోస్టులు, 5 ఎస్‌ఎస్‌టి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడానికి పోలీసు శాఖ పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ తెలిపారు.
బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి 17 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. ఇందులో 15,750 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,709, కనిష్టంగా రూ.1,619 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,611, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,901, కనిష్టంగా రూ.1,624, పత్తి గరిష్టంగా రూ.6,681, కనిష్టంగా రూ.5,060 చొప్పున పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,702, కనిష్టంగా రూ.2,059 చొప్పున ధరలు లభించాయి. కాగా.. దేవరకద్రలో ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవాల కోసం గురువారం, చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు ఇచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు.
నేడు మహబూబ్‌నగర్ స్థాపన దినోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని మీర్ మహెబూబియా హాల్‌లో గురువారం ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్ స్థాపన వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆరో నిజాం మీర్ మహెబూబ్‌అలీఖాన్ బహదూర్ ఫౌండేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్ 135వ స్థాపన వేడుకలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రిటైర్డ్ ఆర్మీ పాండురంగారెడ్డి, తామీరే మిల్లత్ అధ్యక్షులు మహ్మద్ జియావుద్దీన్ నాయర్ తదితరులు పాల్గొంటారన్నారు. వేడుకల్లో మహబూబ్‌నగర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
‘దేశంలో 40 కోట్ల
దొంగ ఓట్లు’
వనపర్తి రూరల్: దేశంలో 130 కోట్ల జనాభా ఉండగా.. దాదాపుగా 40 కోట్ల దొంగ ఓట్లు ఉన్నాయని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఓట్ చోరీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారని వివరించారు. భారత రాజ్యాంగం వర్దిల్లాలంటే ఓటు ఎంతో విలువైందని.. దొంగ ఓట్లతో కేంద్రంలో బీజేపీ గద్దెనెక్కిందని దుయ్యబట్టారు. జిల్లాలో పార్టీ మద్దతుదారులను సర్పంచ్‌లుగా గెలిపించుకునే బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అఽధ్యక్షురాలు, పీసీసీ ప్రధానకార్యదర్శి యాదయ్య, నందిమళ్ల చంద్రమౌళి, మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
చెక్‌పోస్టుల వద్దఅప్రమత్తంగా ఉండాలి


