వేడెక్కిన రాజకీయం
వాతావరణం
ఉదయం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వాతావరణం మధ్యాహ్నం వేడిగా,
రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది.
నారాయణపేట/కోస్గి: ఈ నెల 11న జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలతో తుది జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు మండలాలు కోస్గి, గుండుమాల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల పరిధిలోని మొత్తం 67 పంచాయతీలకుగాను 14 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 53 పంచాయతీలకు 169 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగాను, 572 వార్డుల్లో 198 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 374 వార్డులకుగాను 807 మంది అభ్యర్థులు వార్డు సభ్యులుగాను పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్నవారికి అధికారులు గుర్తులు సైతం కేటాయించడంతో ఇప్పటికే పల్లెల్లో వేడెక్కిన రాజకీయాలకుతోడు ప్రచార హోరు మొదలు కానుంది.
కుదరని ఏకగ్రీవ ‘పంచాయతీ’
సీఎం రేవంత్‌రెడ్డి ఇలాఖాలో ఎక్కువ సంఖ్యలో పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి ఏకగ్రీవం కోసం నాయకులు గట్టిగా ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రత్యేక నిధులతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అధికార పక్ష నాయకులు పల్లెల్లో ప్రచారం చేసి ఏకగ్రీవాల కోసం నడిపిన పంచాయతీలు కుదరకపోవడంతో పలు గ్రామాల్లో అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణకు విముఖత వ్యక్తం చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం తమ సత్తా చాటాలని ఎన్నికల బరిలోకి దిగారు. కొన్నిచోట్ల అధికార పార్టీ అభ్యర్థుల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో ఒక్కరికంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. అధికార ప్రతిపక్షాలను లెక్క చేయకుండా కొన్నిచోట్ల యువకులు సైతం పోటీలో ఉన్నారు. యువతకు అవకాశం ఇస్తే గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. పల్లెల్లో తమ సత్తా చాటేందుకు అధికార పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకోగా మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని ప్రచారంలోకి దింపి ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ విజయం సాధిస్తామని బీఆర్‌ఎస్ అభ్యర్థులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్‌ఎస్ ఓ వైపు, అధికార కాంగ్రెస్ మరోవైపు తమ సత్తా చాటాలని పల్లెపోరుకు సిద్ధం కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి జోరందుకోనుంది.
మూడో విడత తొలిరోజు 575 నామినేషన్లు
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల పర్వం బుధవారం అరంభమైంది. జిల్లాలో ని మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూ ర్, నర్వ మండలాల్లో మూడో విడతలో తొలిరోజు 110 సర్పంచు స్థానాలకుగాను 60, వార్డులు 994 స్థానాలకు 66 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు కొనసాగిన రెండో విడత నామినేషన్ల పర్వం మంగళవారం ఆర్థరాత్రి వరకు ముగిసింది. ఈ విడతలో నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్ మండలాల్లో 95 జీపీలకు గాను 575 మంది సర్పంచు అభ్యర్థులుగా, 900 వార్డులకు గాను 2022 మంది నామినేషన్లు వేశారు.
రేపటి నుంచి కబడ్డీ టోర్నీ
మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నుంచి 51వ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ ప్రారంభం కానుంది.
–8లో u
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
అభ్యర్థుల తుది జాబితా విడుదల
14 జీపీలు.. 198 వార్డులు ఏకగ్రీవం
53 పంచాయతీలకు 169 మంది, 374 వార్డులకు 807 మంది పోటీ
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
వేడెక్కిన రాజకీయం
వేడెక్కిన రాజకీయం
వేడెక్కిన రాజకీయం


