పడమట.. కిటకిట
పడమటి ఆంజనేయస్వామి మూలవిగ్రహం
పడమటి ఆంజనేయస్వామి రథాన్ని లాగుతున్న భక్తులు
మక్తల్: పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన స్వామివారి రథోత్సవం కనుల పండువగా జరిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి రథానికి ప్రత్యేక పూజలు చేసి.. బాలాంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. అత్యంత వైభవంగా కొనసాగిన రథోత్సవానికి ఉమ్మడి పాలమూరు నుంచే కాకుండా.. హైదరాబాద్, కర్ణాటక, పుణె, షోలాపూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా వేలాదిగా తరలివచ్చి తిలకించారు. ఈ సందర్భంగా భక్తుల అంజన్న నామస్మరణతో రాంలీలా మైదానం, మక్తల్ పట్టణం మార్మోగింది.
పొర్లుదండాలు పెట్టి.. మొక్కులు
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు పొర్లుదండాలు పెడుతూ.. జ్యోతులు వెలిగించి, తలనీలాలు సమర్పించుకొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు కార్యాలయం నుంచి ఊరేగింపుగా వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ రాధ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య స్వామివారిని దర్శించుకున్నారు. పట్టణంలో రాంలీలా మైదానం భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రాణేష్‌కుమార్, ఈఓ కవిత, పూజారి ప్రాణేష్‌చారి, ఆయా పార్టీల నాయకులు రామారావు, ఆశిరెడ్డి, సిద్ధార్థరెడ్డి, బాల్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టువస్త్రాలు తీసుకువస్తున్న
మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు
ఆంజనేయస్వామి సన్నిధిలోమాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి
కనులపండువగా పండువగా ఆంజనేయస్వామి రథోత్సవం
స్వామివారిని దర్శించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి
అశేషంగా తరలివచ్చిన భక్తజనం
పడమట.. కిటకిట
పడమట.. కిటకిట


