
సమస్యలుపరిష్కరించుకుండా..
సర్కారు బడుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి, ఖాళీలు భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుంది. ఆ తర్వాత తనిఖీలు చేపడితే ప్రయోజనం ఉంటుంది. మరోవైపు తోటి ఉపాధ్యాయులు తనిఖీ అధికారులుగా రావడం ఇబ్బందిగా ఉంటుంది. తనిఖీలకు వెళ్లిన టీచర్ల స్కూళ్లలో బోధన కుంటుపడుతుంది.
– శేర్ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, తపస్
ప్రభుత్వ బడుల బలోపేతానికి
ప్రస్తుతం జిల్లా, మండలస్థాయి విద్యాశాఖ అధికారులతో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను సాధారణ తనిఖీలు చేస్తున్నారు. ప్రత్యేకంగా బడుల తనిఖీకి బృందాలను ఏర్పాటు చేయడం మరింత ప్రయోజనం చేకూరాలని ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జిల్లాలో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు కృషి చేస్తాం.
– గోవిందరాజు, జిల్లా విద్యాధికారి
●

సమస్యలుపరిష్కరించుకుండా..