
పెట్టుబడి కూడా వచ్చేలా లేదు..
అన్ని పంటలతో పోలిస్తే మిర్చికి పెట్టుబడి ఎక్కువ. కాలం కలిసొస్తే ఇబ్బందులు తీరుతాయనే ఆశతో నష్టం, లాభం చూడకుండా ప్రతి ఏటా మిర్చి సాగు చేస్తున్నా. పోయిన ఏడాది అనావృష్టితో దిగుబడి సరిగా రాలేదు. ధర కూడా లేకపోవడంతో చాలా నష్టపోయా. ఈ ఏడాదైనా కలిసిరాకపోతుందా అని 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వచ్చింది. పంట పూతకు వచ్చే సమయంలో వర్షాలు తగ్గకపోవడంతో పంట పూర్తిగా నాశనమైంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– రాజశేఖర్, అయ్యవారిపల్లి, చిన్నంబావి, వనపర్తి
అధిక వర్షాలతో తెగుళ్లు పెరిగాయి..
ఈసారి కురిసిన అధిక వర్షాలకు మిర్చి పంటలో మొదలు కుళ్లు (కాలర్ రాట్), విల్ట్ తెగులు వచ్చింది. ఎండు తెగులు(విల్ట్ తెగులు) నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్‌ను లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదట్లో వేరు దగ్గర మందు నీళ్లు పోయాలి. ఈ సమయంలో బూడిద తెగులు కూడా ఎక్కువగా కనిపిస్తోంది. బూడిద తెగులు నివారణ కోసం అమిస్టార్ ఫంగిసైడ్‌ను లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున లేదా సాఫ్ ఫంగిసైడ్‌ను లీటర్‌కు 2 గ్రాముల చొప్పున కలుపుకుని పిచికారీ చేయాలి.
– ఆదిశంకర్, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం
●

పెట్టుబడి కూడా వచ్చేలా లేదు..