
స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుదాం
నారాయణపేట టౌన్: జిల్లాకేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని పుర కమిషనర్ నర్సయ్య కోరారు. స్థానిక వివేకానంద పార్కులో గురువారం ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాథ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను వాకర్స్‌తో కలిసి శుభ్రం చేశారు. అనంతరం కమిషనర్ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. పట్టణ ప్రజలు సంవత్సరానికి 100 గంటలు లేదా రోజుకు రెండు గంటలు స్వచ్ఛందంగా పరిసరాల శుభ్రకు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో యూనియాన్ బ్యాంక్ మేనేజర్, సిబ్బంది, మార్నింగ్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.