
ఉద్యోగ అవకాశాలు కల్పించేస్థాయికి ఎదగాలి
వనపర్తిటౌన్: ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగం కోసం వెదుక్కోకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని స్థానిక జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌వీఎస్ రాజు ఆకాంక్షించారు. బుధవారం కళాశాలలో డీసీ–ఎంఎస్‌ఎంఈ, న్యూఢిల్లీ సహకారంతో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆలోచన ఉంటే సరిపోదని.. కృషి, పట్టుదల, నమ్మకం ఉండాలని, అన్ని ఉంటేనే జీవితంలో, సమాజంలో రాణించగలమన్నారు. ఎస్‌ఐసీ –టీఎస్సీ డిప్యూటీ మేనేజర్ అబ్దుల్ ఖాదర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌లపై అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ బీవీ రాంనరేష్ పాల్గొన్నారు.