
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
● కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి
● గౌరీదేవి, బతుకమ్మకు ప్రత్యేక పూజలు
● జిల్లా కేంద్రంలో అట్టహాసంగా సంబరాలు
నారాయణపేట రూరల్: బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని, సీ్త్రల ఐక్యతను సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బారంబావి దగ్గర బుధవారం రాత్రి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న బతుకమ్మ వేడుకలు ఈ నెల 21 నుంచి 30 వరకు రోజు ఒక్కో ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయని, బుధవారం పురపాలిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చక్కగా చేశారని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. మహిళలంతా కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ నెల 30న సద్దుల బతుకమ్మ వేడుకలను ఇదే బారం బావి ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని చెప్పారు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మను తలపై పెట్టుకుని వస్తున్నకలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ