
పాలమూరు చుట్టే రాజకీయం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సెగ రాజేసింది.. తెలంగాణ మలి దశ పోరులో రణనినాదమై నిలిచింది పాలమూరే. తలాపున కృష్ణమ్మ ఉన్నా.. సాగు, తాగునీరు లేక వలసలతో తండ్లాడిన ఇక్కడి ప్రజల దీనగాధ, వెనుకబాటుతనమే ప్రతి ఒక్కరి గళమైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిలూదింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనా, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ‘పాలమూరు’దే కీలక భూమిక. అలాంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015లో ఈ ఎత్తిపోతలకు అడుగులు పడగా.. అప్పుడు, ఇప్పుడూ దీని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలకు పాలమూరు ప్రచారాస్త్రంగా మారగా.. రైతాంగానికి మాత్రం సాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
పీఆర్‌ఎల్‌ఐ కేంద్రంగా పాలి‘ట్రిక్స్’
పాలక, ప్రతిపక్షాల పోటాపోటీ విమర్శలు
90 శాతం పనుల పూర్తి.. మిగిలిన 10% పూర్తి చేయాలి..
ఇదే డిమాండ్‌తో పోరుబాటకు బీఆర్‌ఎస్ సన్నాహాలు
దీటుగా స్పందించేలా కాంగ్రెస్ కార్యాచరణ
‘స్థానిక’ ఎన్నికల వేళ రాజుకున్న వేడి