నారాయణపేట: జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టుకు నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన బి.ప్రభాకర్ బుధవారం ఎస్పీ యోగేష్ గౌతమ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. భవిష్యత్తులో జిల్లాలోని పోక్సో కేసుల విచారణలో పోలీసులు ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో వేగవంతమైన న్యాయం అందించేందుకు అవసరమైన సహకారం అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలి
నారాయణపేట: బీసీలకు రిజర్వేషన్ 42 శాతం అమలుచేసి స్థానిక ఎన్నికలు జరపాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా మారిందని.. పంచాయతీల్లో పాలక వర్గ పదవీకాలం పూర్తవడంతో ప్రతినెలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో పల్లెల్లో పాలన గాడి తప్పిందన్నారు. ఆరు నెలలుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కార్మికులకు వేతనాల్లేవన్నారు.
గ్రామపంచాయతీ కార్యదర్శులు లక్షల కొద్ది వారి జీతాలను చెల్లించి గ్రామ అభివృద్ధిలో పాటుపడుతున్నరని, ఇంతవరకు వారి బిల్లులు రావడం లేదన్నారు. వర్షాలతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, వీధుల్లో, మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోయినా వాటిని శుభ్రం చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవటంతో వారు విధులపై దృష్టి పెట్టడం లేదన్నారు. ప్రభు త్వం నుంచి నిధులు రానందున కార్యదర్శులు సైతం చేతులెత్తేశారన్నారు. ట్రాక్టర్లు నడవడానికి డీజిల్ సైతం లేనందున ఎక్కడి చెత్త అక్కడే ఉందన్నారు. త్వరితగతిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామా పాలనకు శ్రీకారం చుట్టాలన్నారు.
26న ఉద్యోగమేళా
కందనూలు: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో 26న ఉద్యోగమేళా నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధి కారి రాఘవేందర్‌సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 50 ఉద్యోగాల భర్తీకి మేళా కొనసాగుతుందన్నారు. పదో తరగతి ఆర్హత కలిగి 25 నుంచి 32 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 95051 86201, 96669 74704 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ఎస్పీని కలిసిన పోక్సో కోర్టు పీపీ