
యూరియా కోసం వర్షంలోనూ బారులు..
నారాయణపేట టౌన్: జిల్లాలో యూరియా కష్టాలు ఇప్పట్లో తీరిలే కనిపించడం లేదు. రైతులు ఒక్క బస్తా యూరియా కోసం టోకన్లు తీసుకొని ఎండలో నిలబడే దుస్థితి ఏర్పడింది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక యాదగిరి రోడ్డు దగ్గర ఉన్న అగ్రోస్ రైతు సేవా కేంద్రం– 2 దగ్గర రైతులు యూరియా కోసం ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగుల సాయంతో క్యూ లైన్‌లో నిలిచి ఉన్నారు. ఈక్రమంలో తోపులాట చోటుచేసుకోగా పోలీసులు అదుపుచేశారు. అనంతరం యూరియా సరఫరా చేశారు. కాగా క్యూ లైన్లో నిలబడ్డ కూడా కొందరి రైతులకు యూరియా లభించక పోవడంతో నిరాశతో వెనుదిరిగారు.