
హోంగార్డుల సంక్షేమానికి చర్యలు
నారాయణపేట: జిల్లాలోని హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో హోంగార్డ్స్‌కు డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన రెయిన్ కోట్స్, స్వెటర్స్‌ను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హాక్ అందజేసి మాట్లాడారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. నిరంతరం రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి వర్షాకాలంలో అత్యవసర సమయాలలో రెయిన్ కోట్స్, స్వెటర్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో సీఐ నరసింహ, హోమ్ హార్డ్స్ ఇంచార్జి ఆర్‌ఎస్‌ఐ మద్దయ్య, శిరీష, కృష్ణ చైతన్య సిబ్బంది పాల్గొన్నారు.