
వేతన వ్యథ..
అతిథి అధ్యాపకులకు 8 నెలలుగా అందని జీతాలు
● గత డిసెంబర్ నుంచి పెండింగ్
● నెలల తరబడి వేతనాలు అందక అవస్థలు
● జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 22మంది మాత్రమే రెన్యువల్
● మరో 22మంది పరిస్థితి అయోమయం
●
కుటుంబ పోషణ
భారంగా మారింది..
ప్రభుత్వం కొన్ని నెలలుగా వేతనాలు అందించకపోవడంతో అవస్థలు పడుతున్నాం. కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. – బాల్‌రాజ్,
అతిథి అధ్యాపకుడు, గుండుమాల్
ఉద్యోగ భద్రత కల్పించాలి..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొన్నేళ్లుగా పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నాం. తమకు నెలల తరబడి వేతనాలు అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి. – మధుసూదన్‌రెడ్డి,
అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర కోశాధికారి
ప్రొసీడింగ్ విడుదల..
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, గెస్ట్ లెక్చలర్స్, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 970 మంది వేతనాలపై ప్రభుత్వం ప్రొసీడింగ్ విడుదల చేసింది. అందులో దాదాపు 398 మంది అతిథి అధ్యాపకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్ బోర్డు పరిశీలనలో ఉంది. త్వరలోనే అతిథి అధ్యాపకులకు వేతనాలు అందే అవకాశం ఉంది.
– సుదర్శన్‌రావు, డీఐఈఓ
మద్దూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఎనిమిది నెలలుగా వేతనాలు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఓవైపు వారిని పూర్తిస్థాయిలో రెన్యువల్ చేయకపోవడం.. మరోవైపు నెలల తరబడి వేతనాలు అందించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 8–10 ఏళ్లుగా పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషిచేసిన ఎంతో మంది అతిథి అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం రెన్యువల్ చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులను నియమించడంతోనే అతిథి అధ్యాపకుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని పలువురు వాపోతున్నారు.
భూనీడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాభోదన చేస్తున్న అతిథి అధ్యాపకుడు

వేతన వ్యథ..

వేతన వ్యథ..

వేతన వ్యథ..

వేతన వ్యథ..

వేతన వ్యథ..