
డబ్బులు సరిపోవడం లేదు
ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకోగా మాకు ఇల్లు మంజూరైంది. అయితే ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఇక్కడ రేట్లు పెరగడంతో ఇల్లు కట్టుకోలేక పోతున్నాం. ఇసుక, సిమెంట్, సీకుల ధరలు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం మార్కెట్ రేటు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు పెంచాలి.
– హోటల్ పార్వతమ్మ, ఇర్కిచేడు, కేటీదొడ్డి మండలం, గద్వాల జిల్లా
ధరలు పెరిగాయి.. భారంగా మారింది...
ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణానికి అయ్యే ఖర్చులో కొంతభాగం ప్రభుత్వం అందించడం చాలా సంతోషంగా ఉంది. బేస్‌మెంట్ వరకు పూర్తి చేస్తే రూ.లక్ష బిల్లు వచ్చింది. కానీ ఇసుక, సిమెంట్, ఇటుక, కంకర, స్టీల్ ధరలు బాగా పెరగడంతో నిర్మాణం భారంగా మారింది. ఇసుక ఉచితంగా, స్టీల్, సిమెంట్, కంకర, ఇటుక తక్కువ ధరకు అందిస్తే బాగుంటుంది.
– చింతకాల గౌతమి, కడుకుంట్ల (వనపర్తి)
నాలుగు నెలలైనాబిల్లు రాలేదు..
ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. డబ్బులు లేకపోయినా అప్పు చేసి బేస్‌మెంట్ వరకు నిర్మించుకున్నాం. అధికారులు ఫొటో, వివరాలు తీసుకొని మూడు నెలలు అయింది. ఇప్పటివరకు బేస్‌మెంట్ బిల్లు రూ.లక్ష రాలేదు. చేతిలో చిల్లి గవ్వలేక ఇంటి నిర్మాణాన్ని ఆపేశాం.
– ఆలేటి ఎల్లమ్మ,
గట్టురాయిపాకుల, నాగర్‌కర్నూల్ జిల్లా
ఆధార్‌కార్డుల్లో తప్పులతో ఇబ్బంది
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాం. జిల్లాలో ఇప్పటివరకు 4,103 మంది లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.42.84 కోట్లు జమ చేశాం. ఆధార్‌కార్డుల్లో తప్పులతో పలువురికి సమస్యలు తలెత్తగా.. పరిష్కారానికి కృషి చేస్తున్నాం. జీఎస్టీ రేట్లు తగ్గనున్న నేపథ్యంలో ఇప్పటివరకు దూరంగా ఉన్న లబ్ధిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
– వైద్యం భాస్కర్, గృహనిర్మాణశాఖ పీడీ, మహబూబ్‌నగర్
●

డబ్బులు సరిపోవడం లేదు

డబ్బులు సరిపోవడం లేదు