
రూ.6.50 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
నిధుల ప్రతిపాదన ఇలా..
అమరచింత: నియోజకవర్గంలో అతిపెద్ద ఎత్తిపోతల చంద్రగఢ్‌కు మహర్దశ రానుంది. ఏళ్ల కిందట మరమ్మతుకు గురై ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించకుండా ఉన్న ఎత్తిపోతల మరమ్మతుపై మంత్రి వాకిటి శ్రీహరి దృష్టి సారించారు. మక్తల్ పర్యటనకు వచ్చిన భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమస్యను విన్నవించి నిధులు మంజూరు చేయాలని కోరడం.. రెండు నెలల కిందట ఆయకట్టు రైతులతో కలిసి మరోమారు సంబంధిత శాఖ మంత్రిని కలవగా మరమ్మతుకు వెంటనే రూ.6.50 కోట్లు మంజూరు చేసి ఇందుకు సంబంధించిన జీఓ పత్రాలను సైతం ఇరిగేషన్ అధికారులకు అందించారు. ప్రస్తుతం రూ.4 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని.. త్వరలో మరో రూ.2.50 కోట్లు రావచ్చని వెల్లడిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జూరాల జలాశయం నిల్వనీటి ఆధారంగా చంద్రగఢ్, బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి 2005లో అప్పటి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో ఎత్తిపోతల కింద 5 వేల ఎకరాల ఆయకట్టును రూపొందించి సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టారు. కాని పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసిరకంగా చేపట్టడంతో పాటు నిర్వహణ బాధ్యతలను రైతులకు అప్పగించా రు. నాణ్యత లేని పైపులు వినియోగించడంతో ఎక్కడికక్కడే పగిలి నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ప్రతి ఏటా పైపులు పగిలి పంటలు నష్టపోయిన సందర్భా లు ఎన్నో ఉన్నాయి. గత ప్రభుత్వ హయంలో పైపుల మార్పునకు నిధులు మంజూరు చేయాలని పలుమా ర్లు ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా కూడా విడుద ల చేయలేదు. ప్రస్తుతం చంద్రగఢ్, బెక్కర్‌పల్లి ఎత్తిపో తల కింద 2,800 ఎకరాలు మాత్రమే సాగవుతుంది.
● నాగిరెడ్డిపల్లి, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్యానల్ బోర్డులు కాలిపోవడంతో వీటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంది. అదేవిధంగా ఎత్తిపోతల నీటిని ఆయకట్టు రైతులకు అందించేందుకుగాను అంతర్గత పైప్‌లైన్లు వేయాల్సి ఉంది. పైపులు పగిలిపోవడం, లీకేజీలు ఏర్పడటంతో మంజూరైన నిధులతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి. వీటితోపాటు అనేక చిన్న చిన్న మరమ్మతులు, విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లను బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కొత్త ప్యానల్ బోర్డులు,
పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు
టెండర్ ప్రక్రియలో ఆలస్యం
వినియోగంలోకి రానున్న
నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి ఎత్తిపోతలు
ఉమ్మడి లిఫ్ట్ ఆయకట్టు
15 వేల ఎకరాలు
నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కెనాల్, పైప్‌లైన్ మార్చాల్సి ఉండగా.. చిన్న సంపుహౌజ్‌లు నిర్మించాల్సి ఉంది. కొత్త ప్యానల్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో వీటికోసం రూ.2.85 కోట్లు ప్రతిపాదించారు.
చంద్రగఢ్ ఎత్తిపోతల పథకంలో ప్యానల్ బోర్డు, పైపులైన్ మార్చేందుకు రూ.1.93 కోట్లు ప్రతిపాదించారు.
బెక్కర్‌పల్లి ఎత్తిపోతల పనులకు సంబంధించి రూ.2.13 కోట్లు అవసరమంటూ అప్పట్లోనే నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు అందించారు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి కూడా ఇవ్వడంతో నిధులు మంజూరయ్యాయి.