
చిక్కులు సరిచేస్తేనే భూములిస్తాం
పరిహారం పెంపుతోపాటు సర్వే చేసి ఎవరి భూమి ఎంత పోతుందో తెలిపిన తర్వాతే భూములిస్తామంటూ మక్తల్ మండలంలోని కాట్రేవ్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు తేల్చిచెప్పారు. అదే మండలంలోని మంతన్‌గోడ్, టెకులపల్లి, ఎంనాగన్‌పల్లి రైతులు మాత్రం సమ్మతి పత్రాలను అధికారులకు అందజేశారు. మిగతా గ్రామాల రైతులు ముందుకు వస్తున్నారు. ఇదిలాఉండగా, పరిహారం పెంచాలనే డిమాండ్‌తో కానుకుర్తిలో చేపట్టిన రిలేదీక్షలు శుక్రవారం నాటికి 37వ రోజుకు, జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 60వ రోజుకు చేరుకున్నాయి.